Breaking News

కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం భాయ్ భాయ్

ఆరో వార్డులో వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరుల భాగస్వామ్యం

జమ్మికుంట,సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)
కులమతాలకు అతీతంగా హిందూ–ముస్లిం సోదరులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చాటిచెప్పేలా ఆరో వార్డు ప్రజలు మరోసారి స్నేహభావాన్ని చాటుకున్నారు. ఆరో వార్డులోని యాద ధనంజయ్ కిరాణా దుకాణం సమీపంలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

వినాయక చవితి వేడుకల్లో ముస్లిం సోదరులు సైతం స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ మాట్లాడుతూ.. “మనమందరం ఒక్కటే.. స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం” అనే భావనకు ఆరో వార్డు ప్రజలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని అన్నారు.ఏ పండుగైనా కులమతాలకు అతీతంగా అందరం కలిసి జరుపుకోవాలని, హిందూ–ముస్లిం సోదరులు భాయ్‌భాయ్‌గా సోదరభావంతో మెలగాలని ఆమె ఆకాంక్షించారు. వార్డులో ఇదే ఐక్యత, స్నేహభావం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరారు.

ఈ సందర్భంగా శ్రీశక్తి మహిళా వినాయక కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కౌన్సిలర్ దంపతులకు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో శ్రీశక్తి వినాయక కమిటీ మహిళలు, వార్డు ప్రజలు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *