Breaking News

ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్

సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి)

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది.

సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు ధర్మవరం పట్టణంలోని వివిధ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

సెప్టెంబర్ 16న మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం పట్టణంలోని ఆర్డీటీ మైదానంలో నిర్వహిస్తున్న అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3 ఫైనల్ మ్యాచ్‌కు హాజరై పోటీలను వీక్షించడంతో పాటు విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మరియు మీడియా మిత్రులను మంత్రి కార్యాలయం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *