Breaking News

పసుపు రైతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలను వివరించడంతో పాటు, పసుపు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా పసుపు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటికి తగిన…

Read Full News

SIR అంశంపై సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్!

ఎలక్షన్ కమిషన్ (EC) చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియను సవాల్ చేస్తూ AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి సరైన ప్రక్రియ పాటించకుండా ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాన డిమాండ్లు: ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని కోరారు. ఫారం-6 దరఖాస్తులతో పాటు మ్యాపింగ్ వంటి నిబంధనలు సాధారణ ఓటర్లకు…

Read Full News

నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ఫండ్ కేటాయించాలి

26వ డివిజన్‌లో రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 14 (E6 న్యూస్: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు (స్పెషల్ ఫండ్) కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 26వ డివిజన్‌లో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ భూమిపూజ చేశారు….

Read Full News

మూడు దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా దేవీ నవరాత్రి వేడుకలు

మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పటాన్‌చెరు, అక్టోబర్ 14 (E6 న్యూస్ ప్రతినిధి). పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్‌లో మహంకాళి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని…

Read Full News

నీళ్లు లేక ఎండుతున్న వరి పంట.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతు

చివరి దశలో నీటి కొరతతో అన్నదాత ఆందోళన రెండు ఎకరాల సాగుకు రూ.50 వేల పెట్టుబడి.. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా నాగిరెడ్డిపేట, అక్టోబర్ 14 (E6 TV NEWS). పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత రైతును ఆందోళనకు గురిచేస్తోంది. వరి పంట చివరి దశకు చేరుకున్న వేళ సాగునీరు అందక పొలం ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో ఓ రైతు పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన…

Read Full News

మంచి అధికారులకు కష్టాలు తప్పవా?

రుద్రూర్‌లో వర్గపోరు.. నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇబ్బందులు తప్పవా? ఒకే పార్టీలో రెండు వర్గాలు.. పాలనపై ప్రభావం చూపుతున్నాయా? రుద్రూర్, అక్టోబర్ 14 (E6 TV News: శివ ఠాకూర్). రుద్రూర్ మండల కేంద్రంలో అధికారుల బదిలీలు, స్థానిక రాజకీయ వర్గపోరు అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే అధికారులకు రాజకీయ విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. మండలంలోని ఓ శాఖలో పనిచేసిన…

Read Full News

భైంసా ప్రాజెక్టు పరిధిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

న్యూ ఆబాది కేటగిరీకి ఈ నెల 14న ధ్రువీకరణ.. హాజరుకాని వారికి 16న ప్రత్యేక అవకాశం భైంసా, అక్టోబరు 13 (E6tv NEWS). భైంసా ప్రాజెక్టు పరిధిలోని భైంసా, కుంటాల మండలాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ICDS అధికారులు మంగళవారం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరై ధ్రువీకరణ చేయించుకున్నారు. న్యూ ఆబాది కేటగిరీ కింద అందిన 228 దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 14వ తేదీన…

Read Full News

అటవీ అధికారులపై దాడి.. ఐదుగురి అరెస్ట్

హాజీపూర్ తండాలో ఘటన.. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు ఎల్లారెడ్డి, అక్టోబరు 13 (E6tv న్యూస్ ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 30న హాజీపూర్ అటవీ ప్రాంతంలో అటవీ బీట్ అధికారులు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ విధులు నిర్వహిస్తుండగా, హాజీపూర్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు వారి…

Read Full News

రాయసముద్రం చెరువు వద్ద దుర్గామాతకు ఘనంగా పూజలు

అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్‌చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, అక్టోబర్ 13 (E6 NEWS ప్రతినిధి) రామచంద్రపురం 2,6,8వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద కొలువుదీరిన దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్…

Read Full News

రేపు ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన

మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు.. పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv NEWS ప్రతినిధి). ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం, అక్టోబర్ 14న ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ పర్యటనలో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలతో పాటు పలు గ్రామాల్లో జెండా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవాలు కొక్కొండ, లక్ష్మాపూర్, బిక్కనూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మహిళా సంఘాల…

Read Full News