Breaking News

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి)  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…

Read More

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…

Read More

రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అరాచకాలు:భాజపా మహిళా మోర్చా

హైదరాబాద్ (E6TV): తెలంగాణలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అరాచకాలపై చర్యలు తీసుకోవాలని, మహిళా భద్రతను బలోపేతం చేయాలని కోరుతూ బిజెపి మహిళా మోర్చా బృందం శుక్రవారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీరును మహిళా మోర్చా నాయకులు తీవ్రంగా…

Read More

ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం

ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….

Read More

విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…

Read More

వినాయక నిమజ్జనం:పోలీసు శాఖ మార్గదర్శకాలు!

హైదరాబాద్: వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేయడానికి పోలీసు శాఖ, ప్రభుత్వం సంయుక్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నాయి. శోభాయాత్రలు, నిమజ్జన ఘాట్ల వద్ద భక్తుల భద్రత కోసం పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కీలక భద్రతా & ముందస్తు చర్యలు: మండప నిర్వాహకులు కేటాయించిన సమయం, మార్గాలను పాటిస్తూ భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

Read More

కొండా సురేఖ బీజేపీలో చేరుతారా?: క్లారిటీ ఇచ్చిన డీకే అరుణ!

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం ఆమె బీజేపీలోకి చేరుతారంటూ సాగుతున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ డీకే అరుణ తెరదించారు. సురేఖను పార్టీలోకి ఆహ్వానించే అంశంపై బీజేపీలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. డీకే అరుణ వ్యాఖ్యలలో ప్రధాన అంశాలు: కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ సహా స్వపక్ష నేతలపై సురేఖ కుమార్తె చేసిన తీవ్ర వ్యాఖ్యలను కట్టడి చేయలేకపోయారనే నెపంతో కాంగ్రెస్ హైకమాండ్ సురేఖను కేబినెట్…

Read More

కొండా సురేఖ బర్తరఫ్‌పై మండిపడ్డ డీకే అరుణ: బీసీ మహిళపై కక్షసాధింపా?

హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కొరవడిన క్రమశిక్షణ, అంతర్గత విభేదాల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. డీకే అరుణ విమర్శల ప్రధానాంశాలు:

Read More

తెలంగాణ కేబినెట్‌లోకి రాములమ్మ?: కొండా సురేఖ స్థానంలో విజయశాంతికి ఛాన్స్!

హైదరాబాద్: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం సీతక్క ఒక్కరే మహిళా మంత్రిగా ఉండటంతో, సురేఖ స్థానంలో మరొక మహిళా నేతను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ రేసులో ఫైర్‌బ్రాండ్ నాయకురాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రేసులో పలువురు నేతలు – విజయశాంతికే మొగ్గు?: యశస్వినీ రెడ్డి (పాలకుర్తి), పద్మావతి రెడ్డి (కోదాడ),…

Read More

ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త, గొప్ప ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం ఘనంగా నివాళులర్పించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: తన సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సమాజ అభివృద్ధికి, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. తమ జ్ఞానం, మార్గదర్శకత్వం,…

Read More