Hyderabad
చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ
చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) సి. సూర్యనారాయణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సూర్యనారాయణ మండల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు కృషి…
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
రిమ్స్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమీక్ష ఫైర్ సేఫ్టీ, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రతపై అధికారుల దృష్టి మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచన నిజామాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: శివ ఠాకూర్). ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
ఎన్నికల షెడ్యూల్‌కు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్ హైదరాబాద్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తనను తిరిగి ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని అప్పుడే వెల్లడిస్తానని చెప్పారు.ఎన్నికల…
దానం నాగేందర్‌కు బిగ్ షాక్: ఖైరతాబాద్‌లో బై-ఎలక్షన్ ఫిక్స్?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, దానం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: కేసు నేపథ్యం: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, 2024లో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా…
రూ.1.01 కోట్లకు దాటేసిన గణేశుడి లడ్డూ!
హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూ వేలం పాటలు మరోసారి రికార్డు ధరలతో హోరెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలానికి ముందే గేటెడ్ కమ్యూనిటీలలో లడ్డూ ధరలు కోట్ల మార్క్‌ను దాటుతుండటం విశేషం. కీర్తి రిచ్‌మండ్‌లో రూ.1.01 కోట్లు: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ‘కీర్తి రిచ్‌మండ్’ గేటెడ్ కమ్యూనిటీలో మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో స్వామివారి లడ్డూ ఏకంగా రూ. 1,01,00,000 (రూ.1.01 కోట్లు) పలికింది. కమ్యూనిటీ నివాసితులు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడగా,…
దానం నాగేందర్ అనర్హత కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ!
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అసలు వివాదం ఏంటంటే? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్…
గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో విషాదం: గుర్తుతెలియని బైక్ ఢీకొని ఎస్ఐ మృతి
హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న ఎస్ఐ కిన్నెర వెంకన్న (55) బైక్ ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగిందంటే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న వెంకన్న, గణేష్ నిమజ్జన బందోబస్తు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-2 వద్ద ఆయన విధుల్లో ఉండగా, ఒక గుర్తుతెలియని…
భర్తే హత్య చేశాడంటూ ఆరోపణలు..
మృతురాలి బంధువుల రాస్తారోకో భైంసా, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి). భైంసాలో మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళనకు దిగారు. భైంసా ఏరియా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుబీర్ మండలంలోని బెల్గాం తండా-2 గ్రామానికి చెందిన లత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం బావిలో లభించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లతను ఆమె భర్త రోహిదాస్ హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి…
వర్ణి మండల MRPS నూతన కమిటీ ఎన్నిక
వర్ణి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి సోంపూర్ పోచిరాం ఆధ్వర్యంలో, జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి ఆదేశాల మేరకు వర్ణి మండల కేంద్రంలో MRPS మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా సంగోల్లా అశోక్, ఉపాధ్యక్షులుగా సమేనా కాశీరామ్, ప్రధాన కార్యదర్శిగా నెమ్లి ప్రభాకర్ను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా చిట్టోళ్ల శ్రీనివాస్, ఫట్లా సాయిలు, కోశాధికారిగా ఈబత్వార్ మారుతీ, ప్రచార కార్యదర్శిగా సిందిగిడి రవిలను నియమించారు.సలహాదారులుగా కొరోల్లా సాయిలు, మెరుగు…
అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవ కార్యక్రమం
అనంతపురం,సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి) అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. వినికిడి, మాట్లాడే లోపాలతో ఉన్న దివ్యాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా…
