Breaking News

నిజామాబాద్ నగర అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్లు, వంతెనలు, కొత్త జాతీయ రహదారి కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్) నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…

Read More

ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…

Read More

భీంగల్ బస్టాండ్‌లో కంట్రోలర్ పోస్టు ఖాళీ.. ప్రయాణికుల ఇబ్బందులు

హోంగార్డుతో నిర్వహణపై ప్రజల అసంతృప్తి భీంగల్ బస్టాండ్‌కు శాశ్వత కంట్రోలర్‌ను నియమించాలని డిమాండ్ భీంగల్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ బస్టాండ్‌లో ఆర్టీసీ కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ స్థానంలో డిపోలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును బస్టాండ్‌కు నియమించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, భీంగల్ బస్టాండ్ నుంచి వేల్పూర్, బోధన్,…

Read More

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి: టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహణకు యూఎస్‌పీసీ నిర్ణయం ఏర్గట్ల, ఆగస్టు 7: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో…

Read More

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

కొత్త అప్రోచ్ రోడ్లు, MRR, CRR, హ్యామ్ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచన నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్ ) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా….

Read More

తెలంగాణలో పడిపోతున్న విద్యా ప్రమాణాలు.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు చేయాలి: ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య!

హైదరాబాద్ (E6TV News): తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు తగ్గడం మరియు పాలనా లోపాల వల్ల విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి కేటాయింపులను పెంచడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని (NEP 2020) రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్కువ బడ్జెట్.. జీతాలకే సరిపోతోంది: పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి ఏరి?: రాష్ట్రానికి స్వతంత్రంగా…

Read More

జోగిపేట ఏరియా ఆస్పత్రి డాక్టర్ సస్పెన్షన్.. ప్రైవేట్ డెంటిస్ట్‌తో వైద్యం చేయించినందుకు దామోదర రాజనర్సింహ చర్యలు!

హైదరాబాద్ / జోగిపేట (E6TV News): ప్రభుత్వ ఆసుపత్రికి డ్యూటీకి హాజరుకాకుండా తన స్థానంలో ఓ ప్రైవేట్ దంత వైద్యుడితో (Dentist) రోగులకు పరీక్షలు చేయించిన తీవ్ర నిర్లక్ష్య ఉదంతంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా స్పందించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రికి చెందిన డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ రమేష్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగింది? సూపరింటెండెంట్‌పై డిపార్ట్‌మెంటల్ యాక్షన్:…

Read More

మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…

Read More

డాక్టర్ ఎంసీఆర్ ‘టిమ్స్’లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు.. ఏర్పాట్లను వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్ (E6TV News): హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) ఆసుపత్రిలో ప్రజలకు త్వరలోనే పూర్తిస్థాయి సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ట్రయల్ రన్ (Trial Run) వైద్యసేవలు, మౌలిక వసతులు, నియామకాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలోని కీలక ఆదేశాలు:…

Read More

నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ (E6TV News): జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం మన చేనేత కళ అని ఆయన కొనియాడారు. సీఎం సందేశంలోని ముఖ్యాంశాలు: చేనేత కార్మికుల కష్టపడే తత్వానికి, అద్భుతమైన సృజనాత్మకతకు తగిన గౌరవం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read More