Hyderabad
ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ విస్తృత పర్యటన
ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి ధర్మవరం, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి)ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రజారోగ్యం, సంక్షేమం, మౌలిక వసతులు, పర్యావరణ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. 72 నూతన 104 మొబైల్ మెడికల్ యూనిట్లు ప్రారంభం…
SIR ప్రక్రియ వివాదంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: కేటీఆర్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రమైన విశ్వాస సంక్షోభం నెలకొందని, ఇద్దరు కమిషనర్లు వ్యక్తంచేసిన ఆందోళనలు అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినందున ఈ అంశంపై మరే ప్రభుత్వ సంస్థ విచారణ జరిపే అవకాశం లేదని, అందుకే భారత సర్వోన్నత న్యాయస్థానం…
అమరవేణి నర్సాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన జాజుల శ్రీనివాస్ గౌడ్
నిర్మల్, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబాన్ని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘాల నాయకులు, మాజీ మావోయిస్టు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి తమ అండగా ఉంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ…
ఇంటి ముంగిటకే మీసేవ సేవలు:మంత్రి శ్రీధర్ బాబు!
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కారీ సేవల కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గిస్తూ “మీ సేవ డోర్ డెలివరీ” సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ నూతన విధానం ప్రకారం పౌరులు తమకు కావలసిన సర్టిఫికెట్లు లేదా సేవల…
థర్మల్ పవర్ ప్లాంట్లపై BRS బిగ్ అటాక్: రంగంలోకి 6 ప్రత్యేక బృందాలు!
తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పష్టత సాధించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పవర్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులు మరియు నిర్వహణ లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పార్టీ తరఫున ఆరు ప్రత్యేక నేతల బృందాలను ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ బృందాలు రేపు ఆయా పవర్ స్టేషన్లను సందర్శించి వివరాలు సేకరించి నివేదిక తయారు చేయనున్నాయి. కేటీఆర్ తెలిపిన వివరాల…
గణేష్ నిమజ్జనం వేళ ‘ఫ్యూచర్ సిటీ’లో వైన్స్, బార్లు క్లోజ్!
గణేష్ నిమజ్జన ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతల పరిరక్షణతో పూర్తి చేసేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం… సెప్టెంబర్…
రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు అవగాహన
పుట్టపర్తి, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని కార్మిక కర్షక భవన్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లో భాగంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ వి. రాంభూపాల్ హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వి. రాంభూపాల్ మాట్లాడుతూ, స్థానిక రాజకీయ పరిస్థితులను కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఓట్ల…
జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం సానుకూలత!
అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి ఎద్దడి పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ బృందం కర్ణాటకలో పర్యటించింది. తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో మరోసారి కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో నెలకొన్న తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడిని, పంటల ప్రస్తుత పరిస్థితిని తెలంగాణ బృందం సీఎం డి.కె. శివకుమార్‌కు వివరించింది. మానవతా దృక్పథంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి…
ఫేమస్ అయ్యాక గిరాకీ తగ్గిందా? సంపాదనపై నోరు విప్పిన కుమారి ఆంటీ!
హైదరాబాద్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ (దాసరి సాయికుమారి) తన బిజినెస్, రోజువారీ ఆదాయం మరియు వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీది మొత్తం 1000 అయింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే డైలాగ్‌తో పాపులర్ అయిన ఆమె, తాను వైరల్ కాకముందే వ్యాపారం మరింత బాగా జరిగేదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గతంలో తన హోటల్‌కు రోజుకు 1,500 మంది వరకు కస్టమర్లు వచ్చేవారని,…
పోచారంలో ఆరుగురికి రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ
పోచారం, సెప్టెంబర్ 22: (E6tv NEWS: ప్రతినిధి). పోచారం గ్రామంలో సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ ఆధ్వర్యంలో రోల్‌బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పెన్షన్ పొందుతూ, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఆరుగురు అర్హులైన లబ్ధిదారులకు తిరిగి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్లకు సంబంధించిన సమస్యలను…
