Breaking News

చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా సూర్యనారాయణ బాధ్యతల స్వీకరణ

చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండల ప్రత్యేక అధికారిగా (స్పెషల్ ఆఫీసర్) సి. సూర్యనారాయణ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులైన సూర్యనారాయణ మండల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి, పరిపాలనా కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చెన్నేకొత్తపల్లి ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *