మృతురాలి బంధువుల రాస్తారోకో
భైంసా, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).
భైంసాలో మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహిస్తూ ఆందోళనకు దిగారు. భైంసా ఏరియా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కుబీర్ మండలంలోని బెల్గాం తండా-2 గ్రామానికి చెందిన లత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం బావిలో లభించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లతను ఆమె భర్త రోహిదాస్ హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. భర్తపై హత్య కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఘటనపై పూర్తిస్థాయి, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగానే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
– విలేకరి: రిజ్వాన్ అహ్మద్

