Hyderabad
అలరించిన శిశుమందిర్ విద్యార్థుల వినాయక నిమజ్జన ఊరేగింపు
ముధోల్, సెప్టెంబర్ 20: (E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. శోభాయాత్రను తిలకించిన పట్టణ ప్రజలు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.అనంతరం పట్టణ శివారులోని చెరువు…
చిత్తారి హరిబాబు హత్య కేసులో A-1 అరెస్ట్
ప్రతీకారంతోనే హత్యకు పథకం.. కత్తితో దాడిచేసిన గంధం సంతోష్ టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, మరో రెండు కత్తులు, రెండు కర్రలు స్వాధీనం నిజామాబాద్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన చిత్తారి హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు (A-1) గంధం సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన సుమారు ఒకటిన్నర రోజులోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు నిజామాబాద్…
గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్ రెడ్డి
శాంతియుతంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జన మార్గంలో పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ,…
కదిరి అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలి
ఎమ్మెల్యే, ఆర్డీఓలకు కాంగ్రెస్ నేతల వినతి పత్రాలు కదిరి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో కదిరిలో ఇచ్చిన అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన…
ఎడపల్లి పీహెచ్‌సీని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్
ఎడపల్లి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. పీహెచ్సీలో ప్రజలకు అందుతున్న ఓపీ, ఐపీ సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫార్మసీ డిస్పెన్సింగ్ రూమ్, ప్రధాన మందుల స్టోర్‌ను పరిశీలించిన ఆయన మందుల నిల్వలు, గడువు తేదీలను తనిఖీ చేశారు. గడువు ముగియనున్న మందులను ముందుగానే…
బాల గణేష్ మండలి వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దంపతులు నిజాంసాగర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). నిజాంసాగర్ మండల కేంద్రంలోని బాల గణేష్ మండలి వద్ద శుక్రవారం అన్నశాంతి (అన్నదాన) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజపల్లి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అనంతరం కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆయన సతీమణి శైలజ బాల గణేష్ మండలిని సందర్శించారు. ఈ సందర్భంగా…
యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో సర్పంచ్ అశోక్ పటేల్‌కు సన్మానం
మద్నూర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) మేనూర్ గ్రామంలోని యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్‌ను ఘనంగా సన్మానించారు. శుక్రవారం గణేష్ మండలి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ పటేల్ పాల్గొన్నారు.అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ అశోక్ పటేల్‌కు గణేష్ మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనూర్ కెనరా బ్యాంక్ అధికారులు కుమారస్వామి, ఉష, సంతోష్, ఆకాష్, నవీన్…
యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
హిందూపురం క్రీడా సంస్కృతికి నిలయం అనంతపురం, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి) గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణతో పాటు ప్రోత్సాహం అందించేందుకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా RDT క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది…
వర్షాభావ పరిస్థితుల్లో కేంద్ర సహకారం అందించాలి
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి E6tv NEWS: (సెప్టెంబర్ 18). ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర…
నిజామాబాద్ రీజియన్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు
వాణిజ్య ఆదాయం పెంపునకు అవకాశాల పరిశీలన నిజామాబాద్, సెప్టెంబర్ 18: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (IT, P, A, M & Legal) ఎం. రాజశేఖర్ నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ పి. జ్యోతి, నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఎం.వి. రమణ, నిజామాబాద్-2 డిపో…
