ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దంపతులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి).
నిజాంసాగర్ మండల కేంద్రంలోని బాల గణేష్ మండలి వద్ద శుక్రవారం అన్నశాంతి (అన్నదాన) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజపల్లి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అనంతరం కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆయన సతీమణి శైలజ బాల గణేష్ మండలిని సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
అన్నదాన కార్యక్రమం సందర్భంగా మండలి పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మండలి నిర్వాహకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




