Breaking News

లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్

రసం పీల్చే పురుగుల నివారణకు రైతులకు సూచనలు లచ్మాపూర్, ఆగస్టు 1: (E6 tv NEWS M, మస్నాజీ) లచ్మాపూర్ శివారులోని పత్తి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) విశాల్ గౌడ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పంచ దోమ, తెల్ల దోమ, పెను బంకలను గుర్తించి, వాటి నివారణకు రైతులు సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పురుగుల నివారణ కోసం ఒక లీటర్ నీటికి…

Read More

ఊర పండగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆగస్టు 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దారి మళ్లింపు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసుల సూచన నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). ఊర పండగ సందర్భంగా ఆగస్టు 2న నిర్వహించే ఊరేగింపును పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. పోలీసుల వివరాల ప్రకారం,…

Read More

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తాం: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి.

జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS: శివ ఠాకూర్). ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం ఉదయం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, జర్నలిస్టుల మిత్రుల అందరి తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య…

Read More

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

వర్షాలతో ఇల్లు కూలిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS, శివ ఠాకూర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. శనివారం నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో భారీ వర్షాలకు షేక్ ఫిరోజ్ నివాసం కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా…

Read More

విదేశీ ఉద్యోగార్థులకు ‘టామ్‌కామ్’ ద్వారా సమగ్ర సేవలు: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

హైదరాబాద్: తెలంగాణ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు శిక్షణ ఇవ్వడం, జాబ్ మేళాలు నిర్వహించడం, పాస్‌పోర్ట్ సేవలు అందించడం మరియు విదేశాల్లో మంచి ఉద్యోగాలు కల్పించే మొత్తం ప్రక్రియ బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM – టామ్‌కామ్)కే అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ‘శక్తి’ (SHAKTI – Skill Human Capital and Knowledge Training Initiatives) శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు….

Read More

ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం

నిజామాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం.. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS శివ ఠాకూర్. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు బహిరంగంగా…

Read More

సైబరాబాద్‌కి ‘యెల్లో అలర్ట్’: మధ్యాహ్నం నుంచి వర్షాలు, ఈదురుగాలులు సాధ్యం.. ట్రాఫిక్ పోలీసుల మార్గదర్శకాలు!

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం (ఆగస్టు 1) వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ‘యెల్లో అలర్ట్’ (Yellow Alert) ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఒకటి రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం…

Read More

బడిలో ఉపాధ్యాయులు, సిబ్బందికీ ఉచిత టిఫిన్, మధ్యాహ్న భోజనం: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో చదువుకునే విద్యార్థులతో పాటు, అక్కడ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు (Teaching Staff) మరియు బోధనేతర సిబ్బందికి (Non-Teaching Staff) కూడా సీఎం టిఫిన్ (TG Breakfast) మరియు మధ్యాహ్న భోజన (Mid-Day Meal) సదుపాయాన్ని విస్తరిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు…

Read More

ఆగస్టు 15 వరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమలు

విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS). ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్,…

Read More

ఖరీఫ్ 2026: తెలంగాణకు సరిపడా ఎరువుల సరఫరా.. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ స్పష్టత!

హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన స్థాయిలో ఎరువుల నిల్వలను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెదక్ బిజెపి ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 1 నుండి జులై 26 మధ్య కాలంలో రాష్ట్రంలో ఎరువుల లభ్యత అవసరాల కంటే అదనంగానే ఉందని, ఎక్కడా…

Read More