ఎమ్మెల్యే, ఆర్డీఓలకు కాంగ్రెస్ నేతల వినతి పత్రాలు
కదిరి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి).
ఎన్నికల సమయంలో కదిరిలో ఇచ్చిన అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లు…
- కదిరిలో ఇంజనీరింగ్ కళాశాలకు వెంటనే శంకుస్థాపన చేయాలి.
- పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- ఇండస్ట్రియల్ పార్క్‌కు పునాదులు వేయాలి.
- పాలిటెక్నిక్ కళాశాల నుంచి రాయచోటి రోడ్డును కలుపుతూ చెన్నై రోడ్డుకు అనుసంధానించే రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయాలి.
- కదిరి పట్టణ హిందూ సోదరులకు హామీ ఇచ్చిన ఆధునిక స్మశాన వాటికను వెంటనే నిర్మించాలి.
- టమాటా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి.
- రైతులకు ఉపయోగపడేలా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి.
- పెండింగ్‌లో ఉన్న చెన్నై–అనంతపురం రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలి.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కే. ఖదబకాష్ అష్రఫ్, నచ్చు బాలకృష్ణ యాదవ్, కదిరి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాబా ఫక్రుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు శౌకతలి ఖాన్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


