శాంతియుతంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి).
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
నిమజ్జన మార్గంలో పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిప్రమాదాల నివారణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. శోభాయాత్రలో భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ విఠల్ రెడ్డి కోరారు.

