పెనుకొండ, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి)
రాష్ట్ర మంత్రి సవిత బుధవారం (సెప్టెంబర్ 16) పెనుకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి కార్యాలయం వెల్లడించిన పర్యటన వివరాల ప్రకారం..
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అనంతరం ఉదయం 11 గంటలకు రొద్దం మండలం గోనిమేకలపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు వెంకట రామిరెడ్డి వైకుంఠ సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు రొద్దం మండలం మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అశ్వర్థ నారాయణ తండ్రి నారాయణప్ప వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరవుతారు.మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు తల్లి, మంత్రి సవితమ్మ పెద్దమ్మ జయమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
మంత్రి సవిత పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు సమన్వయంతో చేపట్టాలని మంత్రి కార్యాలయం సూచించింది.

