Breaking News

చక్రం గుడిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: శివ ఠాకూర్).

నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాస కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల నిర్వహించే మాస కల్యాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

భక్తిశ్రద్ధల మధ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాస కల్యాణం
చక్రం గుడిలో ఘనంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *