Breaking News

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్: షాక్‌లో గణేష్ ఉత్సవ కమిటీలు!

హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు సిటీ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వెలిసిన హెచ్చరిక ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరంలో తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోర్టు నిబంధనలకు లోబడి ఉత్సవ నిర్వాహకులు నిమజ్జనానికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామని వారు స్పష్టం చేశారు.

అయితే, చివరి నిమిషంలో వెలిసిన ఈ ఫ్లెక్సీల వల్ల ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులలో తీవ్ర అయోమయం నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో విగ్రహాల నిమజ్జనం ప్రారంభం కానుండటంతో, బొమ్మలను ఎక్కడికి తరలించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. సరైన ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు లేదా సూచిక బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయకపోవడంపై నిర్వాహకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *