Breaking News

నిజాంసాగర్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

అచ్చంపేటలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజాంసాగర్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).

నిజాంసాగర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండలంలోని అచ్చంపేట గ్రామంలో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు.

అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *