తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అచ్యుతరాయుడు ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన జనసేన ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబానికి అండగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ₹1 లక్ష, గోపాలపురం నేత దిరిశిన ఫాతిమారాణి ₹50 వేలు, కొవ్వూరు ఇన్ ఛార్జ్ టి.వి. రామారావు మరియు ఇతర నేతలు కలిసి ₹1 లక్ష చొప్పున మొత్తం ₹2.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్త కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కార్యకర్త కుటుంబానికి తక్షణమే స్పందించి ఆర్థిక భరోసా కల్పించిన జనసేన నేతలపై స్థానికులు, కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

