వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
రాజీనామాను ధ్రువీకరించిన జిల్లా సహకార అధికారి!
లింగంపేట్, నవంబర్ 16: (E6tv NEWS).
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల పరిధిలోని శట్పల్లి సంగారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లింగంపేట్ (పీఏసీఎస్) డైరెక్టర్ పదవికి నిజ్జన విఠల్ రాజీనామా సమర్పించారు. వ్యక్తిగత కారణాల వల్ల డైరెక్టర్ పదవిలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
2026 నవంబర్ 4వ తేదీన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిజ్జన విఠల్, నవంబర్ 16వ తేదీన తన రాజీనామా లేఖను జిల్లా సహకార అధికారి (డీసీఓ), కామారెడ్డి జిల్లా వారికి లిఖితపూర్వకంగా అందజేశారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కాగా, నిజ్జన విఠల్ సమర్పించిన రాజీనామాను కామారెడ్డి జిల్లా సహకార అధికారి ధ్రువీకరించినట్లు సమాచారం. ఈ రాజీనామా స్థానిక సహకార సంఘం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆశించిన పదవి రాకపోవడమా? లేక నిజంగానే తన వ్యక్తిగత కారణాలవల్లనే రాజీనామాను చేశారా? ఏది ఏమైనా లింగంపేట్ మండలంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

