Breaking News

పొతంగల్, ఎత్తోండా సొసైటీల్లో నామినేటెడ్ చైర్మన్ ఎన్నిక వద్దు

రైతులు, సొసైటీ సభ్యుల ద్వారానే ఎన్నిక నిర్వహించాలి

సొసైటీల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలిబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్

బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఆర్ఎస్పీ నేతల డిమాండ్

పోతంగల్, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి)నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్ చేశారు.పోతంగల్ సొసైటీలో సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల మేర, ఎత్తోండా సొసైటీలో కూడా దాదాపు రూ.8 నుంచి రూ.9 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సొసైటీలకు నామినేటెడ్ విధానంలో చైర్మన్‌ను ఎంపిక చేయకుండా, రైతులు, సొసైటీ సభ్యుల ద్వారా ఎన్నిక నిర్వహించాలని కోరారు.

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ సొసైటీ, కోటగిరి మండలం ఎత్తోండా గ్రామ సొసైటీల్లో నామినేటెడ్ విధానంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించవద్దని ఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, ఆర్ఎస్పీ నాయకులు బాలు డిమాండ్ చేశారు.పోతంగల్ సొసైటీలో సుమారు రూ.8 నుంచి రూ.9 కోట్ల మేర, ఎత్తోండా సొసైటీలో కూడా దాదాపు రూ.8 నుంచి రూ.9 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సొసైటీలకు నామినేటెడ్ విధానంలో చైర్మన్‌ను ఎంపిక చేయకుండా, రైతులు, సొసైటీ సభ్యుల ద్వారా ఎన్నిక నిర్వహించాలని కోరారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్పీ నేతలు మాట్లాడారు. గతంలో ఈ రెండు సొసైటీలు రాష్ట్రంలోనే పేరుగాంచిన పెద్ద సొసైటీలుగా ఉన్నాయని, గతంలో కూడా భారీ మొత్తంలో అవకతవకలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొన్నారు.సొసైటీల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఆర్థిక అవకతవకలపై రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించడంతో పాటు సీబీసీఐడీ ద్వారా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులు, సొసైటీ సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆర్ఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *