Breaking News

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల వివాదం: హైకోర్టు షాకింగ్ నిర్ణయం..

‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపు మరియు ప్రత్యేక షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరి నిమిషంలో టికెట్ ధరలను పెంచడంపై ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ నిర్ణయానికి గల స్పష్టమైన కారణాలను నమోదు చేశారా అని నిలదీసింది. అంతేకాకుండా, ధరల పెంపుపై ప్రజలకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆరా తీసింది.

సెప్టెంబర్ 20న ప్రభుత్వం ఇచ్చి జీవో మెమోను పునఃపరిశీలించి, దానిని ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షో మరియు సెప్టెంబర్ 24న థియేటర్లలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌లోని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన కోర్టు, ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *