Breaking News

ఆదివాసీల ఆరాధ్య దైవం.. భగవాన్ బిర్సా ముండా!

భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమం

బిర్సా ముండా వీరోచిత పోరాటం, స్వాతంత్ర్య ఉద్యమ సేవలపై విద్యార్థులకు అవగాహన

పటాన్‌చెరు, నవంబర్ 12 (E6 TV న్యూస్).

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుడు భగవాన్ బిర్సా ముండా అని వక్తలు పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఈఎల్‌లో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా జీవిత చరిత్ర, ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత ఉద్యమం గురించి విద్యార్థులకు వివరించారు.1875 నవంబర్ 15న ఝార్ఖండ్‌లోని ఉలిహాతు గ్రామంలో జన్మించిన బిర్సా ముండా, చిన్న వయస్సులోనే బ్రిటిష్ పాలకుల దోపిడీ, ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఆయన చేసిన సేవలు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.

ఆదివాసీ సమాజంలో చైతన్యం నింపి, వారి హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన బిర్సా ముండా జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *