హైదరాబాద్లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర చర్యలు చేపట్టారు. వాహనాల గుర్తింపును దాచేందుకు, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లను మార్చిన వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, గత వారం రోజుల్లోనే ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలను జప్తు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను (HSRP) మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ ఐపీఎస్ స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసినా లేదా అంకెలు కనిపించకుండా మాయం చేసినా క్రిమినల్ కేసులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ, ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం!

