నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు. ఉద్యోగులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.టీజీఎస్ఆర్టీసీ ప్రజలకు నిరంతరాయంగా రవాణా సేవలు అందిస్తూ ప్రజా సేవలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ పీ. జ్యోతి, పి.ఓ. ఆఫీసర్ పద్మజ, ఏ.ఓ. ఆఫీసర్ తుల్య నాయక్, సూపర్వైజర్లు, సెక్యూరిటీ విభాగం సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది క్రమశిక్షణతో పరేడ్‌లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.



