జుక్కల్ మండలం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి).
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, వార్డు సభ్యులు శివాజీ పటేల్, సంగ్రామ్, హైదర్ సాబ్, నాగనాథ్, షాదుల్, ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు, కారోబార్ ఎం. గంగారం పాల్గొన్నారు.అలాగే రజక సంఘం సభ్యులు సీహెచ్. నాగనాథ్, సీహెచ్. హోసన్న, గ్రామ పెద్దలు ఈశ్వర్ గొండ, డీలర్ శంకర్, మాజీ వార్డు సభ్యులు శివాజీ, దొడికింది బాబుతో పాటు గ్రామ మహిళలు, స్థానికులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ సేవలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

