Breaking News

ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తాజా పరిణామాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు జడ్పీ చైర్‌పర్సన్ పదవుల సీట్ల సర్దుబాటు, కూటమి పార్టీల మధ్య సమన్వయం మరియు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. అయితే, ఈ భేటీలో చర్చించిన అంశాలు మరియు సీట్ల సర్దుబాటుకు సంబంధించి తుది నిర్ణయాల వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *