Breaking News

చీరాల అభివృద్ధి నాదే బాధ్యత.. ఎమ్మెల్యే మాలకొండయ్య హామీ!

బాపట్ల జిల్లా చీరాల పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని మాట్లాడారు. చీరాల పట్టణ సమగ్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత చరిత్రను పరిశీలిస్తే టీడీపీ హయాంలోనే పట్టణాభివృద్ధికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా చీరాల మున్సిపాలిటీలో టీడీపీ చైర్మన్‌ను గెలిపించుకోబోతున్నామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు నమ్మకంతో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులోనూ నిబద్ధత కలిగిన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులనే అభ్యర్థులుగా బరిలోకి దింపామని వెల్లడించారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పౌరులందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, టీడీపీకి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *