Breaking News

మెట్‌పల్లిలో స్థల వివాదం: రూ.6 లక్షల నష్టం!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి పట్టణంలో స్థల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. తాను 12 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి కొందరు వ్యక్తులు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిప్పరి గోపాల్ ఆరోపించారు. ఈ వివాదంలో ఓ పత్రికా విలేఖరితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మపురికి చెందిన ఓ మహిళ తన స్థలానికి ఆనుకుని ఉన్న ప్రాంతంపై వివాదం సృష్టిస్తోందని, ఈ నేపథ్యంలోనే తన స్థలానికి ఏర్పాటు చేసుకున్న ప్రీకాస్ట్ ప్రహరీ గోడను కూల్చివేయడంతో సుమారు రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని గోపాల్ వాపోయారు.

ఈ వివాదంపై హద్దుల స్పష్టత కోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు హద్దులను నిర్ధారించుకుని మళ్లీ ప్రహరీ గోడ నిర్మించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే పదే పదే తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నారని, ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *