Breaking News

బీఆర్ఎస్ నేత అరెస్ట్: గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే ధర్నా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ నాయకుడు బుర్ర ముత్యాలు గౌడ్ అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుర్ర ముత్యాలును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకుడిని మందలించినందుకే ముత్యాలుపై అక్రమ కేసులు బనాయించారని, అదే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.

అరెస్ట్ చేసిన బుర్ర ముత్యాలును వెంటనే విడుదల చేయాలని, టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిరసన మధ్యనే పోలీసులు బుర్ర ముత్యాలును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలించారు. ఈ అరెస్ట్ వ్యవహారం గోదావరిఖనిలో తీవ్ర రాజకీయ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *