మెట్పల్లి, నవంబర్ 15 (E6tv న్యూస్):
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన న్యాయవాది తెడ్డు సురక్ష ఆనంద్ నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులు జారీ చేసి, తెడ్డు సురక్ష ఆనంద్కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సురక్ష ఆనంద్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మహిళా సాధికారత, మహిళల హక్కుల పరిరక్షణతో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని, అర్హులైన మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ మరియు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుకు, తనకు సహకరించిన రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ తెడ్డు సురక్ష ఆనంద్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ముత్యంపేట గ్రామానికి చెందిన న్యాయవాదికి రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
