Breaking News

బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా మాల్యవంతం రాంప్రసాద్

ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి)

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలానికి చెందిన బహుజన నాయకుడు మాల్యవంతం రాంప్రసాద్ నియమితులయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్, రాష్ట్ర కార్యదర్శులు అంపావతి గోవిందు, శ్రీరాములు, జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలైన సామాజిక న్యాయం, సమత్వం, బహుజనుల హక్కులు, సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.ధర్మవరం నియోజకవర్గంలో బీఎస్పీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేస్తానని రాంప్రసాద్ తెలిపారు.

దళిత, బహుజన నాయకుల హర్షం

మాల్యవంతం రాంప్రసాద్‌కు జిల్లా స్థాయి బాధ్యతలు లభించడంపై పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ఈ బాధ్యత మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో బీఎస్పీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *