Breaking News

శ్రీరామ్‌కు ఆత్మీయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్

రాప్తాడు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

కార్యక్రమం అనంతరం పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి శ్రీరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ పట్ల తనకున్న ఆత్మీయతను చాటుకుంటూ ప్రేమపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు.అనంతరం మంత్రి నారా లోకేష్‌కు వీడ్కోలు పలికే సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అందించి ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *