Breaking News

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడే చివరి అవకాశం!!

హైదరాబాద్‌లో 7 దశాబ్దాలుగా విశేష పూజలందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి (69 అడుగుల పంచముఖ సంకటహర గణపతి) దర్శనాలకు సమయం ఆసన్నమైంది. ఈరోజు (సెప్టెంబర్ 23, బుధవారం) రాత్రి వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. రేపు (సెప్టెంబర్ 24న) మండపం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు, బ్యారికేడ్లను తొలగించి, శోభాయాత్రకు మరియు నిమజ్జనానికి అవసరమైన రూట్ మార్గాన్ని సిద్ధం చేయనున్నారు.

పోలీసులు, జీహెచ్ఎంసీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సెప్టెంబర్ 25 (శుక్రవారం) ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభించి, మధ్యాహ్నం 12 గంటల లోపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈసారి నగరవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల గణేశ్ మండపాలు కొలువుదీరగా, 50 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశముంది. దీంతో హుస్సేన్ సాగర్‌తో పాటు సరూర్‌నగర్, కాప్రా, అమీన్‌పూర్ వంటి 150కి పైగా చెరువుల వద్ద అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *