Breaking News

జూరాల నీటి విడుదల: ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు!

జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎడమ, కుడి కాలువల గేట్లను ఎత్తివేశారు. గత వారం రోజులుగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు ఆందోళనలు చేపట్టగా.. వారికి బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతుగా నిలిచారు. రైతుల డిమాండ్లు మరియు నిరసనలపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు నీటిని కిందికి వదిలారు. కాలువల ద్వారా సాగునీరు పారడంతో తమ పంటలను కాపాడుకోవచ్చనే నమ్మకంతో ఆయకట్టు ప్రాంతాల రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలం ముగిసే వరకు ఇలాగే నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *