Breaking News

నర్సింగ్ విద్యార్థిని మిస్టరీ మరణం: వెలుగులోకి తల్లి అనుమానాలు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని హరిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బిఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి, సెలవుల నిమిత్తం రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. మంగళవారం రాత్రి ఆమె తల్లి రాజేశ్వరి బంధువుల ఇంటికి వెళ్లడంతో హరిణి ఒక్కతే ఇంట్లో ఉంది.

రాత్రి రాజేశ్వరి ఇంటికి తిరిగి వచ్చేసరికి హరిణి కనిపించకపోవడంతో, స్థానికుల సహాయంతో వెతకగా ఇంటి వెనుక ఉన్న బాత్‌రూమ్ సమీపంలో విగతజీవిగా పడి ఉంది. హరిణి శరీరంపై గాయాల గుర్తులు, మెడకు చున్నీ బిగించిన ఆనవాళ్లు ఉండటంతో ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కింటి వ్యక్తిపై తనకు అనుమానం ఉందని హరిణి తల్లి తెలపడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై జినత్ కుమార్ క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *