అంతర్రాష్ట్ర జల వివాదాలు, నీటి ఎద్దడి పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ బృందం కర్ణాటకలో పర్యటించింది. తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో మరోసారి కీలక భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో నెలకొన్న తీవ్ర తాగు, సాగునీటి ఎద్దడిని, పంటల ప్రస్తుత పరిస్థితిని తెలంగాణ బృందం సీఎం డి.కె. శివకుమార్‌కు వివరించింది. మానవతా దృక్పథంతో ఆల్మట్టి డ్యామ్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. మంత్రుల విజ్ఞప్తిపై నేరుగా స్పందించిన కర్ణాటక సీఎం, జూరాలకు నీటి విడుదలపై సానుకూలత వ్యక్తం చేస్తూ.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

