నిర్మల్, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందిన అమరవేణి నర్సాగౌడ్ కుమారుడు సిద్ధార్థ బహుజన గౌడ్ కుటుంబాన్ని వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘాల నాయకులు, మాజీ మావోయిస్టు నేతలు పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి తమ అండగా ఉంటామని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నలమాస కృష్ణ, పీకేఎం నాయకులు సమ్మయ్య, సింగరేణి గని కార్మిక సంఘం నాయకులు సత్యం, అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర న్యాయ నాయకులు బంటు శ్రీనివాస్, రాజన్న ఉదయ్, ఆదివాసీ సంఘం నాయకులు గంట సత్యం, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ పాల్గొన్నారు.
అలాగే వివిధ గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు బండారి రమేష్ గౌడ్, సింగం సత్తయ్య గౌడ్, గాజుల ముఖేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, బీసీ సంఘం నేత అనుముల భాస్కర్, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు రావుల రాంనాథ్, కోరిపల్లి భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.



