ఏర్గట్ల, సెప్టెంబర్ 23:(E6tv NEWS: ప్రతినిధి).
ఏర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. సల్వాల సంధ్య, రెండ్ల శ్రావణి తదితరులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను సమర్పిస్తే, అర్హత మేరకు సీఎం సహాయనిధి కింద చెక్కులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.తమకు సీఎం సహాయనిధి చెక్కులు మంజూరు చేయించిన మాజీ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిలకు లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండ్ల రమేష్, ఎండీ మునీర్, రొక్కెడ సంజీవ్, దొబ్బాల మహేష్, రావుల కాసిమ్, రెండ్ల నక్క ఆశన్న, రొక్కెడ సదానంద్, ఈరపట్నం ముత్తెన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


