Breaking News

PDSU నూతన డిగ్రీ కళాశాల కమిటీ ఏర్పాటు

17 మంది విద్యార్థులతో నూతన కమిటీ

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: PDSU

హిందూపురం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి).

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబావలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థులతో చర్చించిన అనంతరం 17 మంది విద్యార్థులతో నూతన డిగ్రీ కళాశాల కమిటీని ఏర్పాటు చేసినట్లు బాబావలి తెలిపారు.

డిగ్రీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో కౌన్సెలింగ్ నిర్వహించి, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి డిగ్రీ కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కోరారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో PDSU విద్యార్థి సంఘం నాయకులు నాగేంద్ర, మహేష్, అనుదీప్, నంజుండేశ్వర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *