Breaking News

ఘనంగా లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలు

కంటి ఆసుపత్రి రోగులకు అన్నదానం

రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్ లయన్ పత్తి రాము జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులు, వారి సహాయకులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.ఈ సందర్భంగా లయన్ పత్తి రాము మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజును సేవా కార్యక్రమంతో నిర్వహించిన క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా చైర్మన్ లయన్ కె.వి. మోహన్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు లయన్ పత్తి రాముకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి, సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జీఎస్టీ కో-ఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, క్లబ్ కార్యదర్శి లయన్ గెంటిల గంగాధర్, క్లబ్ సభ్యులు గాండ్ల మధు, ఏఎంసీ డైరెక్టర్ పార్వతి ప్రవీణ్, సాయికుమార్, బోధన్ క్లబ్ సభ్యులు లయన్ కటకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *