Breaking News

లక్ష్మీ గణపతి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం

రుద్రూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రతిష్ఠాపించబడిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు.

అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *