Breaking News

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఐసీడీఎస్ సీడీపీఓ రాజశ్రీ

తానూర్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి).

పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ సీడీపీఓ రాజశ్రీ తెలిపారు. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ముధోల్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ సమతుల్యమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ లలిత కూడా మహిళలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు.

కార్యక్రమంలో సూపర్‌వైజర్ నిఖిత, గ్రామపంచాయతీ సర్పంచ్ సుగంధ, కార్యదర్శి షఫీక్, ఐసీడీఎస్ సిబ్బంది రోజా, అంగన్‌వాడీ టీచర్లు వందన, శోభ, మనీషా, సావిత్రి, అనిత, సరస్వతి, సురేఖ, చంద్రకళ, నందబాయి, వాణి, సంగీత, సవిత, అర్చన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *