ఏర్గట్ల, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి).
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఇటీవల వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏలూరి నర్సయ్య, లోలపు గంగు (W/o రాజేందర్), ద్యాగల సాయన్న, గుండ కృపాల్ (S/o సురేష్) తదితరులు చెక్కులు అందుకున్నారు. మొత్తం 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు తెలిపారు.బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

