Breaking News

వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలపై శిక్షణ

భీంగల్, సెప్టెంబర్ 25; (E6tv NEWS: ప్రతినిధి)

వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికల (VGPP), VBGRAMG పథకంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో భీంగల్, వేల్పూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా బాబానగర్ గ్రామానికి సంబంధించి సామాజిక పటము, వనరుల పటము రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో PRA పద్ధతిలో గ్రామంలో అవసరమైన పనులను ఎలా గుర్తించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను జిల్లా రిసోర్స్ పర్సన్లు వివరించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి జి. సాయన్న హాజరై మాట్లాడారు. గ్రామాల్లో కొత్త పనులను గుర్తించే ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, గ్రామస్థాయి అధికారులు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి పనులను గుర్తించి ప్రణాళికలో చేర్చాలని తెలిపారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ VBGRAMG పథకంలో సుమారు 375 రకాల పనులు ఉన్నాయని తెలిపారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏపీడీ గంగా మోహన్, వేల్పూర్ ఎంపీడీవో, భీంగల్, వేల్పూర్ మండలాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, VBGRAMG సిబ్బంది, ఏపీవోలు జి. నర్సయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *