ఓటు హక్కు పరిరక్షణ కోస
28న కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)
ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనుంది. SIR ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
TPCC ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. SIR ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆయన రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. నిరసనలో భాగంగా CEC జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ తెలిపింది.
ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిరసన చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

