Breaking News

ఉచిత వైద్య శిబిరంలో జూనియర్ సివిల్ జడ్జి

భైంసా, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)

బైంసా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా జూనియర్ సివిల్ జడ్జి ఆర్.కే. వెంకటరమణ సుహాస్ హాజరై శిబిరాన్ని పరిశీలించారు.

మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స, వైద్య సలహాలు అందించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది అంజద్ షేక్, వైష్ణవి పాళీ క్లినిక్ సిబ్బంది, స్నేహ సొసైటీ అధ్యాపక బృందం, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోఆర్డినేటర్ గైని అరుణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిల్లలకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *