రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన నిజాలు వెలికితీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ హవిల్దార్ మల్లేశ్‌కు ఆయుధాగారం (వెపన్స్ గోడౌన్) ఇంఛార్జ్‌లు సహకరించినట్లు విచారణలో తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెపన్స్ గోడౌన్ కీపర్లుగా ఉన్న వినోద్, శేషులు నిందితుడు మల్లేశ్‌తో కలిసి ఈ చోరీకి పాల్పడ్డారని ఆధారాలతో సహా గుర్తించారు. వీరి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సాంకేతిక ఆధారాల (టెక్నికల్ ఎవిడెన్స్) ద్వారా అధికారులు నిర్ధారించారు.
పోలీస్ కస్టడీలో ఉన్న మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన ఆర్మీ ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 10 రోజుల కస్టడీ విచారణలో భాగంగా, సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం మల్లేశ్‌ను నేరుగా మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కుట్రలో మరికొందరి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
