ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పరిపాలనా నైపుణ్యాలు పెంపొందించడం, సామర్థ్య పెంపుదల (Capacity Building) లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉత్తమ పాలనా విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది.
‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

