Breaking News

8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా నూతన బోరు

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో పనులు ప్రారంభం

100 అడుగుల లోతులోనే నీటి లభ్యత.. 3 ఇంచుల మేర నీరు

ధర్మవరం, సెప్టెంబర్ 29:(E6tv NEWS:ప్రతినిధి)

ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. వార్డులో నెలకొన్న నీటి సమస్యను స్థానికులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని 8వ వార్డు బీజేపీ ఇంచార్జి జూటూరు వెంకటేష్‌తో పాటు నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబును ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు జూటూరు వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన బోరు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరీష్ బాబు హాజరై వార్డు ప్రజలతో కలిసి బోరు పనులను ప్రారంభించారు.బోరు తవ్వకంలో సుమారు 100 అడుగుల లోతులోనే నీటి జాడ లభించగా, దాదాపు 3 ఇంచుల మేర నీరు పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నూతన బోరు అందుబాటులోకి వస్తే వార్డులో తాగునీటి ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను తెలియజేసిన వెంటనే వాటిని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 8వ వార్డులో నీటి సమస్యను గుర్తించిన వెంటనే మంత్రి ఆదేశాలతో నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలను కొనసాగిస్తామని, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తామని హరీష్ బాబు తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.నూతన బోరు పనులు చేపట్టడంపై 8వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూటూరు వెంకటేష్, జమీర్, ఓం ప్రకాష్ గౌడ్, నిరంజన్ యాదవ్, లక్ష్మీనారాయణ, రాము, పోతులయ్యతో పాటు 8వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *